ఆ గ్యాంగ్‌స్టర్‌ 'దేవుడు'.. మరోసారి బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

  • మాఫియా డాన్‌ మున్నాను హత్య చేసిన గ్యాంగ్‌స్టర్‌ సునీత్‌ రాతీ
  • నేరాలకు పాల్పడే వారు ఏదో ఒకరోజు మరొకరి చేతిలో హతమవ్వాలి
  • సునీల్‌ రాతీ ఆ పని చేయాలనేది దేవుడి కోరిక
  • సునీల్‌ చేతిలో మున్నా అంతమొందేలా చేశాడు
  ఉత్తరప్రదేశ్‌ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భాగ్ పట్  ‌లోని జైలులో మాఫియా డాన్‌ మున్నా బజరంగిని హత్య చేసిన గ్యాంగ్‌స్టర్‌ సునీత్‌ రాతీని ఆయన దేవుడిగా అభివర్ణించారు. సదరు హంతకుడు ఉగ్రవాదానికి ముగింపు పలికేలా ఇలా చేశాడని అన్నారు.

"ఏదైనా ఒక రోజు ఉగ్రవాదం సమసిపోవాలి. మున్నా బజరంగిని హత్య చేసి సునీల్‌ రాతీ దేవుడి పాత్ర పోషించాడు. నేరాలకు పాల్పడే వారు ఏదో ఒకరోజు మరొకరి చేతిలో హతమవ్వాలనేది దేవుడి సహజ నియమం. సునీల్‌ రాతీ ఆ పని చేయాలనేది దేవుడి కోరిక. అందుకే సునీల్‌ కూడా దేవుడు. నేరస్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతోంది. త్వరగా న్యాయం చేయడానికి మున్నా బజరంగీని సునీల్‌ చేతిలో అంతమొందేలా చేశాడు" అన్నారు.

కాగా, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కే బీజేపీ ఉత్తరప్రదేశ్‌ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ ఇటీవల 'రాముడు కూడా అత్యాచార ఘటనలను ఆపలేడ'ని అన్న విషయం తెలిసిందే. 
Go Back to Shorts
murder
BJP
mla

More Telugu News